by Suryaa Desk | Sun, Nov 24, 2024, 11:22 AM
శనివారం తిప్పర్తి మండల ఎం ఆర్ సి కార్యాలయం నందు ఇటీవల బదిలీపై వెళ్ళిన తిప్పర్తి మండల విద్యాధికారి శ్రీమతి కత్తుల అరుంధతి ని మండల విద్యాశాఖ ఆధ్యర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాట చేయనైనది ఇట్టి సమావేశమునకు ముఖ్య అతిథిగా తిప్పర్తి తాజా మాజీ జెడ్పిటీసీ పాశం రాంరెడ్డి హాజరై అరుంధతి గారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు పాఠశాలల్లోనే ఉందని పేర్కొన్నారు. మండల విద్యాధికారి గా అరుంధతి ఈ మండలంలో విశిష్టమైన సేవలు అందంచారని, వారు పాఠశాలల అభివృద్ధి కోసం, విద్యాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారని, రాబోవు రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెంచడం కోసం ఉపాయులు కృషి చేయవలసిన అవసరముందని తెలుపారు.
ఈ సందర్భంగా మండల విద్యాధికారి నరసింహ నాయక్ మాట్లాడుతూ తిప్పర్తి మండలంలో పాఠశాలల్లో చదువుచున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాద్యాయులు, వివిధ సంఘాల ప్రతినిధులు అరుంధతి గారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బాలికల ఉన్నత పాఠశాల ప్రధానపాధ్యాయులు తగరం అరుణ శ్రీ, ప్రధానోపాద్యాయులు పౌకత్ అల్. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ . ఎ అపర్ణ ,జయమ్మ, వెంకటయ్య , సంఘాల ప్రతినిధులు మహేందర్ రెడ్డి, కోడదల శంకర్, ఆదిమళ్ళ శ్రీనివాస్, గుర్రం రవి, దామెర్ల వెంకయ్య, లింగమల్లు, శేషయ్య, లక్ష్మీనారాయణ, తిరుమల్ రెడ్డి తదితరాలు పాల్గొన్నారు.