by Suryaa Desk | Sat, Nov 23, 2024, 04:09 PM
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి సర్వే నెంబర్ 186 లో గ్రేవ్ యార్డుకు కేటాయించిన స్థలాన్ని పరిరక్షించి హద్దులు ఏర్పాటు చేయాలని బిజెపి నాయకులు బాచిపల్లి తహసీల్దార్ పూల్ సిగ్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారుల వైఫల్యం, ప్రజా ప్రతినిధుల నిర్లఖ్యం వెరసి బాచుపల్లి మండలం నిజాంపేట్, ప్రగతినగర్, బాచుపల్లీ కి కలిపి మూడు న్నర ఎకరాల చొప్పున మొత్తం 10 ఎకరాల భూమిని కేటాయించారు.|అనంతరం మూడు గ్రామాలు కలిపి ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పడినందున గ్రేవ్ యార్డుకు కేటాయించిన సర్వే నెంబర్ 186 లో స్థలం ఎక్కడ ఉందో తెలియదని, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న 70% హిందువులకి సరిపడ గ్రేవ్ యార్డు స్థలం లేదని ఇతర మతస్థులకు గ్రేవ్ యార్డు స్థలం తో పాటు ఇదే సర్వే నెంబర్ లో 2 ఎకరాల స్థలాన్ని ప్రార్థనా మందిరం కోసం కేటాయించారన్నారు. ఇతర మతస్థుల మనోభావాలను గౌరవిస్తూ హిందువులకు కేటాయించిన స్థలం చుట్టూ బౌండరీ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ బిజేపి అధ్యక్షులు భిక్షపతి యాదవ్, ప్రగతి నగర్ అధ్యక్షులు నరేంద్ర చౌదరి, బా అధ్యక్షులు ప్రసాద్ రాజు, తదితరులు పాల్గోన్నారు.