by Suryaa Desk | Mon, Nov 25, 2024, 12:10 PM
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టుల సొసైటీలకు ప్రభుత్వాలు చేసిన భూ కేటాయింపుల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు సోమవారం సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తుది తీర్పు ఇచ్చింది. సొసైటీలకు గతంలో ప్రభుత్వాలు చేసిన భూ కేటాయింపులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆ కేటాయింపులను రద్దు చేస్తూ ప్రభుత్వానికి సొసైటీలు కట్టిన డబ్బులు తిరిగి వెనక్కి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.