పవన్ కళ్యాణ్ పార్టీలో అందుకే చేరలేదు.. . బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు
by Suryaa Desk |
Sun, Nov 24, 2024, 06:40 PM
తరచూ ఏవో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే.. సినీ నటుడు, నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్.. మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తాను దైవంగా భావించే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో ఎందుకు చేరలేదు.. ఇండియాలో బెస్ట్ సీఎం ఎవరు.. సీఎం రేవంత్ రెడ్డిది ఎలాంటి మెంటాలిటీ.. లాంటి కీలక ఆంశాలపై స్పందించిన బండ్ల గణేష్.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
తాను.. ఇప్పటికీ.. ఎప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనేనని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. తాను.. 2000 సంవత్సరం నుంచి పార్టీకి సన్నిహితంగానే ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నాని.. భవిష్యత్తులోనూ కాంగ్రెస్ కార్యకర్తగానే ఉంటానని స్పష్టం చేశారు. తనకు ఎంతో ఇష్టమైన నటుడు చిరంజీవి.. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా తాను పార్టీ మారలేదని గుర్చు చేశారు. అదేవిధంగా తను ఎంతగానో అభిమానించే, ఆరాధించే పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ పెట్టిన కూడా తాను వెళ్లలేదని.. కాంగ్రెస్ పార్టీ అంటే తనకు అంత అభిమానమని బండ్ల గణేష్ వివరించారు.
మరోవైపు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బండ్ల గణేష్ ప్రశంసల జల్లు కుపించారు. ఇండియాలోని 29 రాష్ట్రాల్లో బెస్ట్ సీఎం ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి మాత్రమేనంటూ ఆకాశానికెత్తారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయనకు ఏ మాత్రం అహం లేదని చెప్పుకొచ్చారు. ఆయన ఒక మిడిల్ క్లాస్ ముఖ్యమంత్రి అని.. ఈరోజుకు కూడా ఆయనది మిడిల్ క్లాస్ మెంటాలిటీనే అని బండ్ల గణేష్ తెలిపారు.
ఇదివరకు ఉన్న ముఖ్యమంత్రిని కలవాలంటే ఎంత కష్టం ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని.. పదేళ్లపాటు కనీసం మంత్రులను కూడా కలిసే పరిస్థితి లేదని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. కానీ.. ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎలాంటి అహంకారం లేకుండా ఎవరినైనా కలుస్తారని.. ఎవరైనా ఆయనకు కలవొచ్చని.. అందుకే ఆయన ఇండియాలోనే బెస్ట్ సీఎం అయ్యారని కొనియాడారు. రేవంత్ రెడ్డికి ఉన్న బ్యూటీ వాళ్ల కుటుంబమే అని చెప్పుకొచ్చారు. ఎవరనైనా రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకుని పేరు పెట్టి మరీ పిలుస్తారంటూ బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.
ఇదే క్రమంలోనే.. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్‌పై బండ్ల గణేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలో రాష్ట్రాన్ని శాసిస్తున్న సమయంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వానికి తాను ఎదురు తిరిగానని చెప్పుకొచ్చారు. ప్రాణంపోయినా సరే కానీ.. బీఆర్ఎస్‌ను మాత్రం పొగడనంటూ బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా.. బండ్ల గణేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.