by Suryaa Desk | Mon, Nov 25, 2024, 03:58 PM
మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండలంలో, గ్రామ పంచాయతీల లో సర్పంచుల లేమితో, గ్రామ పంచాయితీ పరిపాలన మీద ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ లోపంతో లోపభూయిష్టంగా, గ్రామ పంచాయతీల పనితీరు మారింది. గ్రామ పంచాయితీ కార్యదర్శులు, గ్రామ సిబ్బందికి తగ్గట్టుగా పనులను మోరాయించి, చేయించవలసిన పారిశుధ్య కార్యక్రమాలను, రోడ్ల పరిశుభ్రత, రక్షిత మంచినీరు, గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల సత్వర పరిష్కారాల చర్యలను చేపట్టకుండా గాలికి వదిలేసి, ఇష్టానుసారంగా రాజులేని రాజ్యంలోని పరిపాలన ఏ విధంగా ఉంటుందో? అదే విధంగా వ్యవహరిస్తున్న కార్యదర్శుల, ప్రత్యేక అధికారుల పని తీరుపై, కనీసం మండల అభివృద్ధి ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఎంత మాత్రం లేకపోవడంతో, గ్రామ పంచాయితీ కార్యదర్శుల పనితీరు, ఏకచక్రాధిపత్యానికి నిదర్శనముల కనబడుతుందని, గూడూరు మండల, గ్రామాల ప్రజలు విశేషముగా, విశ్లేషించుకుంటూ చర్చించుకుంటున్నారు. ఈనెల 21వ, తారీకున గూడూరు మండల కేంద్రం నడిబొడ్డున, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారిపై పేరుకుపోయిన మట్టి దుమ్ము, వాహనముల రాకపోకలతో దుమ్మంతా జాతీయ రహదారి ఇరువైపులకు పొగ మంచు వలె వ్యాపించడంతో, రహదారికి ఇరు ప్రక్కల ఉన్న షాపుల యజమానులకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో, మనసు కలిచివేసిన రాజకీయ నాయకులు రోడ్లను ఊడ్చి వారి ఉదారభావాన్ని చాటుకున్నారని, అనేక మాధ్యమాల్లో, గొప్పగా ఈ మధ్యనే వచ్చిన కథనాలు గూడూరు మండల ప్రజలతో పాటుగా, జిల్లా, రాష్ట్ర ప్రజలందరూ చూసి ఉండే ఉందురు కదా? మరి ఇది దేనికి సంకేతం ? కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారనే దానికి తార్కానమా?, గ్రామపంచాయతీ కార్యదర్శి, సిబ్బంది విధి నిర్వహణలో వైఫల్యం చెందినారానే దానికి సంకేతమా?. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత, గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి కాలం ముగియడంతో, స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో పరిపాలన ఎంత సుభిక్షంగా కొనసాగుతుందో! అనడానికి ఇదే నిదర్శనంగా చెప్పుకోవచ్చా? ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే!, ఇలాంటి నిరసన కార్యక్రమాల పాత్రను పోషిస్తూ, ప్రజలకు అండగా ఉండి, ప్రజల పక్షాన పోరాడవలసిన ప్రతిపక్ష బిజెపి, బి.ఆర్ ఎస్. పార్టీలు నిద్రమత్తులో నుంచి ఇంకా తేరుకోలేదనే చెప్పుకోవచ్చు. అధికార, ప్రతిపక్ష, రెండు పాత్రలను అధికార కాంగ్రెస్ పార్టీయే పోషిస్తున్నదని చెప్పకనే చెప్పుకోవచ్చు.
ఈ విషయాన్ని గొప్పగా ప్రశంసించడం ఒక కోణం అయితే!. మరో కోణంలో మేజర్ గూడూరు గ్రామ పంచాయతీ సిబ్బందితో, కార్యదర్శి చేయవలసిన పారిశుద్ధ్య కార్యక్రమాలకు, రోడ్ల పరిశుభ్రత, మురికినీటి కాలువల పరిశుభ్రత, గ్రామ పంచాయతీ విధి నిర్వహణలకు తిలోదకాలు ఇచ్చిందనేటందుకు , ఇది నిలువెత్తు నిదర్శనంగా చెప్పుకోవచ్చును. గ్రామ పంచాయితీల పనితీరుపై ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యవేక్షణలు గాని, ఈ పని తీరుపై ఇంతవరకు చర్యలు చేపట్టక పోవడం చూస్తుంటే? పై అధికారుల నిర్లక్ష్య వైఖరి కూడా తేటతెల్లమవుతుందనే చెప్పుకోవచ్చు. మేజర్ గూడూరు మండల గ్రామ పంచాయితీ పరిస్థితే ఇంత దీనంగా ఉంటే! గ్రామాలలోని గ్రామ పంచాయితీల పని తీరు ఇంకెంత దారుణంగా ఉంటుందో? స్పష్టమవుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వ అధికార యంత్రాంగం అప్రమత్తమై గ్రామ పంచాయితీల పనితీరును గాడిలో పెట్టే విధంగా, పర్యవేక్షణలు చేపట్టి, లోపబుహిష్టాలపై చర్యలు చేపట్టాలని, గూడూరు మండల, గ్రామాల మేధావులు, విద్యావేత్తలు, రాజకీయ విశ్లేషకులు, విమర్శకులు విమర్శిస్తూ.. కోరుకుంటున్నారు.