by Suryaa Desk | Sun, Nov 24, 2024, 11:54 AM
మహబూబాబాద్ జిల్లా, గూడూరు గ్రామ పంచాయతీ కేంద్రంలో, కోతులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు. చిన్నపిల్లలు, పెద్దలు కోతుల దాడి లో చాలా మంది గాయపడ్డారు. వాటి భయంతో చిన్నపిల్లలని ఆడుకోవడానికి, ఒంటరిగా పంపాలన్న భయంతో వనికిపోతున్నారు. కోతుల దాడిలో సుమారుగా 300 మంది పైగా, చిన్న పిల్లలు పెద్దవాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. గృహంలో వంటసామాన్లు నాశనం చేస్తుండడంతో పాటు, రైతుల పంటలను ధ్వంసం చేస్తున్నాయి. గూడూరు గ్రామ పంచాయతీ ప్రజలు, మహిళలు, రైతులు, పెద్దలు ఈ విషయమై మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వాంకుడోత్ కొమ్మాలు నాయక్ దృష్టికి తీసుకువెళ్లగా, తన మనసు చలించిపోయి ఆ విషయమై,
గూడూరు గ్రామ పంచాయతీ పెద్దలతో చర్చించి, కోతులను వెంటనే గూడూరు గ్రామపంచాయతీ నుంచి తరిమి కొట్టాలనే సంకల్పంతో, కోతులను పట్టే వాళ్ళని పిలిపించారు. ఈరోజు తన సొంత ఖర్చు సుమారు 4 లక్షల రూపాయలతో, కోతులను పట్టించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో గూడూరు మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీరం శ్రీపాల్ రెడ్డి, మహబూబాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చంటి స్వామి, గూడూరు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాసమల్ల యాకయ్య, ప్రచార కమిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలమందల శ్రీనివాస్, మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు రూపురెడ్డి వెంకటరెడ్డి, టౌన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వల్లపు నాగరాజు, మండల యూత్ కాంగ్రెస్ నాయకులు హెచ్. మనోజ్, నీలం వినయ్, చప్పట్ల రాము, షాజహాన్, కళ్యాణ్ దితరులు పాల్గొన్నారు.