by Suryaa Desk | Mon, Nov 25, 2024, 03:43 PM
వరంగల్ జిల్లా నర్సంపేట కోర్టులో ఈ-సేవ కేంద్రం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నరసింహ రావు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అనంతరం మహిళా కారాగారాన్ని న్యాయ మూర్తులు సందర్శించి,అక్కడి మహిళా ఖైదీలతో చర్చించారు. ఖైదీల ఆరోగ్య,వ్యక్తిగత పరిస్థితులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఉచిత న్యాయ సలహాలు సూచనల కొరకు న్యాయ సేవాధికార సంస్థలను ఆశ్రయించాలని తెలిపారు.
ఈ-సేవా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి.నిర్మలా గీతాంబ , వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యం.సాయికుమార్ ,న్యాయమూర్తి కె.చండీశ్వరీ దేవి ,నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు పుట్టపాక రవి, కార్యదర్శి చిలువేరు కిరణ్ కుమార్, ఏ.జి.పి.లు కె సంజయ్ కుమార్, బి శివ,న్యాయవాదులు కొమ్ము రమేష్ యాదవ్, మోటురి రవి, నారగోని రమేష్, ఠాకూర్ సునీత, బొట్ల పవన్, నాగుల రమేష్, అశోక్, వీరేష్, స్రవంతి,తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.