by Suryaa Desk | Sun, Nov 24, 2024, 12:21 PM
పరిశ్రమల పరిధిలో గల గ్రామాలు, మున్సిపల్ ఏరియాలలో కనీస వసతుల కల్పన బాధ్యత గా స్వీకరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ పరిధిలో ఎన్టిపిసి, సింగరేణి, ఆర్.ఎఫ్.సి.ఎల్, కేశోరాం సిమెంట్ ప్రతినిధులతో కన్వర్జేన్స్ సమావేశం స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తో కలిసి నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ జిల్లాలో ఎన్టిపిసి, సింగరేణి , కేశోరం సిమెంట్, ఆర్.ఎఫ్.సి.ఎల్ పరిశ్రమల పరిధిలో ఉన్న గ్రామాలలో పారిశుధ్యం, త్రాగు నీటి సరఫరా, స్ట్రీట్ లైట్స్ మొదలగు అంశాల బాధ్యతను సదరు పరిశ్రమలు చేపట్టాల్సి ఉంటుందని కలెక్టర్ ఆదేశించారు. రామగిరి మండలం సెంటినరీ కాలనీలో త్రాగు నీటి సరఫరా పనులకు ప్రతిపాదనలు తయారు చేసే సమర్పించాలని కలెక్టర్ ఈఈ మిషన్ భగీరథ గ్రిడ్ ను ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.