by Suryaa Desk | Sat, Nov 23, 2024, 02:47 PM
పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మండల స్పెషల్ అధికారి డీఎఫ్ఓ సతీష్ కుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని బాలికల గురుకుల కళాశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెనూ పాటించాలని విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని నాచిరకమైన భోజనం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ వాణికి సూచించారు. అనంతరం గురుకుల హాస్టల్ చుట్టూ పరిశుభ్రత పాటించాలని, డైనింగ్ హాల్ పరిసరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సయ్యద్ ఇమామ్,పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.