by Suryaa Desk | Sat, Nov 23, 2024, 02:50 PM
డి.డబ్ల్యూ.ఎస్.ఎం లక్ష్యాల సాధనకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశం మందిరంలో డి.డబ్ల్యూ.ఎస్.ఎం (జిల్లా వాటర్ సానిటేషన్ మిషన్) నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, జిల్లాలో పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా విభాగాలను పర్యవేక్షించేందుకు డి.డబ్ల్యూ.ఎస్.ఎం (జిల్లా వాటర్ సానిటేషన్ మిషన్) ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్, జల్ జీవన్ మిషన్ కార్యక్రమాలను డి.డబ్ల్యూ.ఎస్.ఎం పర్యవేక్షిస్తుందని అన్నారు.
మన జిల్లాను ఓడిఎఫ్ + గా ప్రకటించామని, దీనిని నిలబెట్టే విధంగా చర్యలు చేపట్టాలని, జిల్లా వ్యాప్తంగా జరిగే నూతన ఇండ్ల నిర్మాణాలకు టాయిలెట్ ఉండేలా చూసుకోవాలని తెలిపారు. మన గ్రామాలను ఓడిఎఫ్++ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
గ్రామాలలో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా జరగాలని, ప్రతి గ్రామంలో నిర్మించిన కాంపోస్ట్ షెడ్, సామూహిక ఇంకుడు గుంతల పూర్తి స్థాయిలో వినియోగించాలని కలెక్టర్ తెలిపారు. పారిశుధ్య నిర్వహణ లో భాగంగా నిర్మించిన వసతుల వినియోగం పర్యవేక్షించాలని అన్నారు.
ప్రతి మండల స్థాయిలో పారిశుధ్య పై సమావేశం నిర్వహించాలని, బాగా పని చేసేవారిని సన్మానించాలని కలెక్టర్ తెలిపారు. పారిశుధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరా కోసం నరేగా, డిఎంఎఫ్టి, సిఎస్ఆర్ మొదలగు నిధులు వినియోగించాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ వరల్డ్ టాయిలెట్ డే పోస్టర్ ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి శేషాద్రి,సి.ఈ.ఓ. జెడ్పీ వినోద్, డి. ఏ. ఓ.అఫ్జలి బేగం, డి.పి.ఆర్.ఓ. వి.శ్రీధర్, ఈ.ఈ. ఇరిగేషన్ అమరేందర్ రెడ్డి ఈ.ఈ.మిషన్ భగీరథ జానకి, డి.తో.డబ్ల్యూ. ఓ. జనార్దన్, మేనేజర్, ఎస్.బి.ఎ. సురేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.