by Suryaa Desk | Fri, Nov 22, 2024, 07:36 PM
వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థుల సౌకర్యార్థం మెస్ ఛార్జ్ లు పెంచాలని అసెంబ్లీలో చర్చించడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ శుక్రవారం అన్నారు. ఆదిలాబాద్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గల ప్రైమరీ బీసీ హాస్టల్ ను ఆయన సందర్శించారు. పెరిగిన మెస్ ఛార్జీలతో విద్యార్థులకు కలిగిన లాభాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేను ఈ సందర్భంగా విద్యార్థులు శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చం అందచేశారు.