by Suryaa Desk | Sun, Nov 24, 2024, 12:50 PM
పోలీసుల తనిఖీ ల్లో పట్టు బడ్డ తాగుబోతు నడి రోడ్డుపై నానా రభస చేశాడు. హైదరాబాద్ పాతబస్తీ చంపాపేట్ చౌరస్తాలో ఎంఐఆర్ చౌక్ ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ అమరేందర్ రెడ్డి తనిఖీలు నిర్వహిస్తున్నారు.అదే సమయంలో మధ్యం సేవించిన ఓ వ్యక్తి అటుగా వచ్చి పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు అతని వద్ద తనిఖీలు చేయగా.. వాహనానికి నెంబర్ ప్లేట్లు గానీ, ఎటువంటి డాక్యుమెంట్స్ గానీ లేవు.దీంతో పోలీసులు వాహానాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. దీంతో నడి రోడ్డు పైనే ఆ తాగుబోతు వీరంగం సృష్టించాడు. నేను ఏం తప్పు చేయనప్పుడు నా బండి ఎందుకు తీసుకెళ్తున్నారని వాగ్వాదానికి దిగాడు. పక్కనే ఉన్న ఇటుక రాయి తీసుకొని పోలీసుల మీదికి వెళ్లి, చివరికి ట్రాఫిక్ అధికారి కాళ్లు పట్టుకోడానికి ప్రయత్నం చేశాడు. అనంతరం ట్రాఫిక్ పోలీసులు అతన్ని పోలీసులకు అప్పజెప్పి, అతని వాహనాన్ని సీజ్ చేశారు. దీనికి సంబంధించిన వీడయో నెట్టంట చక్కర్లు కొడుతోంది.