by Suryaa Desk | Mon, Nov 25, 2024, 03:51 PM
డిసెంబర్ 1న జరగబోయే మాలల మహా సింహా గర్జనకు జిల్లాలోని ప్రతి ఒక్క ఇంటి నుంచి తరలిరావాలని మాల మహానాడు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆందోల్ మల్లేశం కోరారు. అందోలు నియోజకవర్గ మాల మహనాడు ఇంచార్జి కరుణాకర్ అధ్యక్షతన ఏర్పడిన సమావేశానికి ఆయన హజరై ప్రసంగించారు. మాలల మహా సింహ గర్జన కోసం డాకూరు గ్రామం నుండి ప్రతి మాల కుటుంబంనుండి అందరమూ వెళ్లి మన సంఖ్యా బలాన్ని ప్రదర్శించి మాల మహా సింహ గర్జన ను విజయవంతం చేయాలని కోరారు. సభకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు దాసరి దుర్గయ్య,మండల నాయకులు సాటికే రాజు,మండల నాయకులు కోడేకల్ నర్సింలు,మండల నాయకులు అక్సాన్‌పల్లి సంజీవులుతో పలువురు నాయకులు పాల్గొన్నారు.
డాకూరు గ్రామ కమిటీ ఎన్నిక అందోలు మండలం డాకూరు మాల మహనాడు కమిటీనీ ఏకగ్రీవంగాఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడు మల్లేశం, నియోజకవర్గ అధ్యక్షుడు కరుణాకర్‌లు పాల్గొన్న ఈ సమావేశంలో అ«ధ్యక్షుడిగా జంగిలి అరుణ్ కుమార్,ప్రధాన కార్యదర్శిగా చింతాకి అర్జున్ ఉపాధ్యక్షులుగా గోనెంగారి నవీన్ కుమార్ , కోశాధికారిగా ఆందోల్ మల్లేశం, రాజు, గొనెంగారి రమేష్, బోడ్క ప్రవీణ్ కుమార్ , గోవు మల్లేశం, బేగరి ధన్ రాజ్, టి కరుణాకర్, ఇజి శ్రీకాంత్ , టి శంకర్. టి రమేష్, బి ప్రవీణ్, మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.