by Suryaa Desk | Sat, Nov 23, 2024, 04:07 PM
దుందిగల్ మునిసిపాలిటీ మళ్లంపేట్ గండిగూడం బస్తీ 23 వ వార్డులో నూతనంగా ట్రాన్స్ఫార్మర్ నిర్మించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. రోడ్డు చాలా ఇరుకుగా ఉండడంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. ట్రాన్స్ఫార్మర్ ని ఇక్కడి నుంచి వేరే చోటికి తరలించమని ఈనెల 14వ తేదీన ఎలక్టిసిటీ డిపార్ట్మెంట్ కి ఫిర్యాదు చేసామనారు.
ఇలా పర్మిషన్ లేకుండా ఎవరు పడితే వారు తమ తమ ఇంటిముందు ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేయడం వల్ల రెండు రోజుల క్రితం అంబులెన్స్ కూడా కాలనీలోకి రావడానికి ఇబ్బందులు తలెత్తయాన్నారు. రాత్రి వేళల్లో ఆటోలు, ప్రైవేటు వెహికల్స్ కాకుండా ట్రాన్స్ఫార్మర్ కూడా అడ్డుగా ఉండడంతో ఎమర్జెన్సీ ఉన్న వ్యక్తిని కూడా నడిపించుకుంటూ తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు తగిన చర్యలు తీసుకొని ట్రాన్స్ఫార్మర్ ని వేరే చోటికి తరలించాలని కోరుతున్నారు.