by Suryaa Desk | Sat, Nov 23, 2024, 03:38 PM
దేశ సేవకు ఎన్‌సీసీ అనేది ఒక చక్కని వేదిక అని డఫోడిల్స్ (సి.బి.ఎస్. సి) పాఠశాలలో కరస్పాండెంట్ చింతల నరేందర్ అన్నారు. శుక్రవారం నర్సంపేట పట్టణంలో డఫోడిల్స్ (సి.బి.ఎస్. సి) పాఠశాలలో కరస్పాండెంట్ చింతల నరేందర్,కేర్ టెకర్ వెంకటరత్నం ఆధ్వర్యంలో ఎన్‌సీసీ దినోత్సవ వారోత్సవాలు ఘనగాం నిర్వాహంచి.
ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. ఈ సందర్బంగా చింతల నరేందర్ మాట్లాడుతూ...భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు... మంచి వాతావరణం అని మొక్కలు నాటడం ప్రతి విద్యార్థి జీవితంలో అలవర్చుకోవాలని విద్యార్థులు ఎన్ సి సి ద్వారా వ్యక్తిత్వ వికాసం నాయకత్వ లక్షణాలు నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధికమించ వచ్చని మానసికంగా, శరీరకంగా బలపడి పోలీస్, ఆర్మీ, సివిల్స్ ఉద్యోగాలపై కూడా ఆసక్తి పెరుగుతుందని ముఖ్యంగా సేవా దృక్పధం పెరిగి సమాజంలో సేవా చేసే అవకాశం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం లో పాఠశాల సెక్రటరీ సాయి కీర్తన రోహిత్ , ప్రధానోపాద్యాయులు అజీముద్దీన్, ఉప ప్రధానోపాధ్యాయులు సి. హెచ్ రీటా,హెచ్. ఆర్. డి విజయలక్ష్మి ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.