by Suryaa Desk | Mon, Nov 25, 2024, 03:11 PM
దేవరకొండ పట్టణంలోని స్థానిక ఐబి గెస్ట్ హౌస్ లో ఆదివారం దేవరకొండ నియోజకవర్గం మాల మహానాడు అధ్యక్షులు కన్వీనర్ బోయిని చంద్రమౌళి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ముఖ్యఅతిథిగా మలమానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి పాల్గొని మాట్లాడుతూ సుప్రీం కోర్టు 2024 ఆగస్టు ఒకటో తారీకునా ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకోవచ్చని రాష్ట్రాలకు ప్రతిపాదనలు జారీ చేసిన పిమ్మట.
తెలంగాణ రాష్ట్రంలోని మాలలందరు కూడా సంఘటితమై ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుపడుతూ ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవాలని జిల్లాలలో మాలల చైతన్య సదస్సులు నిర్వహిస్తూ వచ్చేనెల డిసెంబర్( 01) ఒకటో తారీకు నాడు హైదరాబాదులో జింఖానా పెరడ్ గ్రౌండ్లో మాలల సింహ గర్జన సభను తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల అన్ని గ్రామాల నుండి లక్షలాదిక మాలలు తరలివచ్చి కేంద్ర ,రాష్ట్ర పాలక ప్రభుత్వాలకు ప్రతిపక్ష పార్టీలకు మాలల సత్తా చాటాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రాజారావు మాల మహానాడు డివిజన్ అధ్యక్షులు ఏ కుల సురేష్ మాల మహానాడు దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు కన్వీనర్ బోయి నీ చంద్రమౌళి అడ్వకేట్ నూనె సురేష్ రాజేష్ మాల నాయకులు తదితరులు పాల్గొన్నారు