by Suryaa Desk | Sun, Nov 24, 2024, 12:05 PM
ప్రభుత్వ పాఠశాలలో, రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థుల అభ్యసనా సామర్ధ్యాలు పెంపుకు కృషి చేయాలనీ ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. గంభీరావుపేట మండల కేంద్రం లోని కే.జీ. టు పీ.జీ మరియు దమ్మన్నపేట లోని తెలంగాణ మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాలలను జిల్లా కలెక్టర్ శనీవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను పలు అంశాల పై ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. వారి సందేహాలు నివృత్తి చేశారు. పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించారు. విద్యార్థుల హాజరు పై ఆరా తీశారు. ఉపాధ్యాయులు విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ వహించి మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ అంశాల్లో నిష్ణాతులను చేయాలని సూచించారు.
అనంతరం విద్యాలయం ఆవరణలో పరిశుభ్రత పనులు పరిశీలించారు. అనంతరం కిచెన్ లోకి వెళ్లి, కూరగాయలు, పండ్లు ఇతర పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. పలు కూరగాయలు, పండ్ల నాణ్యత లను పరిశిలించారు. ఈ సందర్భంగా తరగతి గదుల్లోకి వెళ్ళారు. ఉపాధ్యాయురాలు పాఠాలు బోధిస్తుండగా పరిశీలించారు. ఇక్కడ ప్రధానోపాధ్యాయులు, టీచర్లు, లెక్చరర్లు తదితరులు పాల్గొన్నారు.