by Suryaa Desk | Sat, Nov 23, 2024, 02:21 PM
ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన వివిధ మండలాలకు చెందిన పలు గ్రామాల లబ్ధిదారులకు మంజూరైన 7, 00000/_ చెక్కులను ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి నర్సాపూర్ మున్సిపల్ పట్టణ క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ బల్దియా ఉపాధ్యక్షులు నయీం ఉద్దీన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సత్యం గౌడ్, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.