by Suryaa Desk | Mon, Nov 25, 2024, 02:53 PM
బంగారం ధరల తగ్గుదల కోసం వారం రోజులకు పైగా ఎదురుచూస్తున్న కొనుగోలుదారులకు ఎట్టకేలకు భారీ ఉపశమనం లభించింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు సోమవారం (నవంబర్ 25) భారీగా దిగివచ్చాయి.దీంతో కొనుగోలుకు ఇదే మంచి తరుణమని పసిడి ప్రియులు భావిస్తున్నారు.దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు నేడు ఎంత మేర తగ్గాయన్నది పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 తగ్గి రూ.72,000 వద్దకు దిగివచ్చింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.1090 తగ్గి రూ.78,550 వద్దకు క్షీణించింది. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో బంగారం ధరలు క్షీణించాయి.దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.1000 తగ్గి రూ.72,150 వద్దకు క్షీణించగా, 24 క్యారెట్ల పసిడి రూ.1090 కరిగి రూ.78,700 వద్దకు వచ్చేసింది.నెలవారీ సంపాదనలో పొదుపు.. ఏదైనా ఆర్థిక సూత్రం ఉందా?మరోవైపు వెండి ధరలు (Silver Price Today) కూడా నేడు మోస్తరుగా క్షీణించాయి. హైదరాబాద్‌లో వెండి కేజీకి రూ.500 మేర తగ్గింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.1,00,500 వద్దకు దిగివచ్చింది.