by Suryaa Desk | Tue, Nov 26, 2024, 08:19 PM
జాతీయ జంతు సంక్షేమ దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా నెక్కొండ మండలం కసుణ తండా గ్రామపంచాయతీ పరిధిలోని దుర్గామాత దేవాలయంలో మరియు కిరాణం షాప్ ఆవరణలో బానోత్ అనూష రవి నాయక్ వారిచే వేప రవి గులాబీ కొన్ని పూల మొక్కలు పండ్ల మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా వన ప్రేమికుడు నల్లగొండ సమ్మయ్య మాట్లాడుతూ మానవాళి ప్రాణవాయువు
పశు పక్ష్యాదులు బ్రతకడానికి చెట్లే మూలాధారం కనుక పర్యావరణం పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం అలవాటు చేసుకొని చెట్లను పెంచి పోషించాలన్నారు. పెరిగిన చెట్లు వటవృక్షాలు అయ్యి మంచి వాతావరణం గాలి నీడ ఆహారం అందించాలని భగవంతుని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో బానోత్ రాములు నాయక్ బానోత్ కృపాకర్ వినోద కోటమ్మ నీల గుగులోత్ కవిత చిన్నారి సాక్షి తదితరులు పాల్గొన్నారు.