by Suryaa Desk | Tue, Nov 26, 2024, 08:03 PM
మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామం ప్రదాన దారి ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తూ నిత్యం ప్రమాదలకు నెలవుగా మారుతుంది.మెట్ పల్లి నుండి గ్రామం మొదలు వరకు మరియు గ్రామం చివర నుండి రోడ్డు విస్తరణ చేసినప్పటికి గ్రామంలో రోడ్డు విస్తరణ దశాబ్దాలుగా తీరని కల గా మిగిలిపోయింది. నిత్యం రద్దీగా ఉండే మెట్ పల్లి నుండి ఆత్మకూర్ మార్గంలో వెల్లుల్ల గ్రామం దాటాలి అంటే వాహనదారులకు, ప్రయాణికులకు పెను సావాలుగా మారింది. గ్రామంలో గల రోడ్డు లో ఒక వాహనం ఎదురుగా వస్తే మరొక వాహనం ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామంలో ట్రాపిక్ పట్టణాలను తలపిస్తుంది. ఉదయం మరియు సాయంత్రం విద్య సంస్థల బస్సులు వస్తే సమస్య తీవ్రత వర్ణనతీతం అని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం సాయంత్రం గ్రామంలో మందు బస్తాల తో వెళుతున్న లారీ బోల్తా పడడంతో ప్రాయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ మరియు ఆస్తి నష్టం వాటిల్లనప్పటికి గ్రామస్థుల్లో తీవ్ర భయందోళనలు నెలకొన్నాయి. గ్రామంలో గల రోడ్డు విస్తరణ చేపట్టనప్పటికి, ఇరుకైనా రోడ్డు సైతం మురికి కాలువలను అనుకోని నిర్మించడం తో పాటు, పలు ప్రదేశాల్లోతారు రోడ్డు ప్రక్కన మట్టి రోడ్డు వేయకపోవడంతో రోడ్డు కోతకు గురవ్వడం తో ఎదురుగా వస్తున్న వాహనం రోడ్డు దిగాలి అంటే ప్రామాదాలకు గురవుతున్నారు. గతంలో పలు ప్రామాదాలు జరిగిన అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శలు వెలువెత్తుత్తున్నాయి.
దశాబ్దాలుగా విస్తరణ లో జాప్యం ..?
గ్రామంలో రోడ్డు విస్తరణ చేపట్టాలంటే గ్రామంలో దాదాపు అర కీలో మీటర్ల మెర ఉన్న 50 పైన గృహాలను తొలగించాల్సి ఉంటుంది కాబట్టి పది సంవత్సరాల క్రితమే తొలగించాల్సిన గృహలు గ్రామస్థుల తిరుగుబాటుతో పనులు ఆగిపోయాయి. గ్రామం అవతలి వైపు నుండి బైపాస్ నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ రైతుల భూములు కోల్పోయే అవకాశం ఉండడం తో రైతుల నుండి వ్యతిరేకత రావడం తో రోడ్డు నిర్మాణం కు బ్రేక్ పడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు రోడ్డు విస్తరణ కళ గా మిగిలిపోయింది. ఇకనైనా అధికారులు గుర్తించి సమస్యకు పరిస్కారం చూపాలని కోరుతున్నారు.