by Suryaa Desk | Tue, Nov 26, 2024, 08:17 PM
TG: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం కూడా సంతోషంగా లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయి మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఏడాది పాలనలో ప్రజలతో ఇన్ని తిట్లు తిన్న పాలకులు గతంలో ఎవ్వరూ లేరని తెలిపారు. ఈ నెల 29 నిర్వహించననున్న దీక్షా దివస్ కార్యక్రమానికి సంబంధించి హైదరాబాద్ జిల్లా సన్నాహాక సమావేశాన్ని తెలంగాణ భవన్లో నిర్వహించారు.