by Suryaa Desk | Tue, Nov 26, 2024, 12:34 PM
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థిని శైలజ మృతి చెందింది.గత నెల ఫుడ్ పాయిజన్‌తో ఆస్పత్రిలో చేరిన శైలజ.. నిన్న నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. స్వగ్రామం దాబాకు శైలజ మృతదేహాన్ని తరలించారు. విద్యార్థిని శైలజ మృతితో పోలీసులు అలర్ట్ అయ్యారు. అర్ధరాత్రి ఆసిఫాబాద్, వాంకిడిలో హైడ్రామా నెలకొంది.శైలజ మృతికి ప్రభుత్వమే కారణమంటూ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. బంధువులు, ఆదివాసీ నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దాబా గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాబా గ్రామానికి బయల్దేరిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో.. పోలీసుల తీరును నిరసిస్తూ.. ఇంటి ఎదుట ధర్నాకు దిగారు ఎమ్మెల్యే కోవ లక్ష్మి.