by Suryaa Desk | Tue, Nov 26, 2024, 12:43 PM
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, రైతు సంక్షేమం దిశగా సీఎం రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుందని యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు రాందేని వెంకటేష్ అన్నారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని 7, 8వ వార్డ్ లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. చివరి వరి గింజ వరకు వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులెవరు ఆందోళన చెండకూడదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వడ్డేపల్లి రాయలింగు, 8వ వార్డ్ కౌన్సిలర్ రాందేని వెంకటేష్, దుమ్మని లచ్చన్న, రాందేని తిరుపతి, అంకతి కిషన్ , వడ్డేపల్లి మల్లేష్, రాందేని చిన్న వెంకటేష్, మెప్మా సిబ్బంది, హమాలీలు పాల్గొన్నారు.