by Suryaa Desk | Tue, Nov 26, 2024, 12:22 PM
జాతీయ మానవ హక్కుల సంఘము వ్యవస్థాపక అధ్యక్షులు అయిల్నేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు..ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నక్క రమేష్,జగిత్యాల జిల్లా అధ్యక్షులు నక్క గంగారాం అలాగే జిల్లా మహిళ అధ్యక్షురాలు పాత రాణి మరియు జగిత్యాల టౌన్ ప్రెసిడెంట్ దేవ్ సింగ్ రాథోడ్ అలాగే నియోజకవర్గ అధ్యక్షులు సంగెపు ముత్హు ఆధ్వర్యంలో గొల్లపెల్లి మండల నూతన కమిటీని నియమించడం జరిగింది.
గొల్లపెల్లి మండల ఎన్ హెచ్ ఆర్ సి అధ్యక్షులుగా చెందొలి గ్రామానికి చెందిన సాయిని నరహరి అలాగే ప్రధాన కార్యదర్శిగా చొప్పదండి చంద్రయ్య,ఉపాధ్యక్షులుగా ముస్కు శ్రీనివాస్ రెడ్డి,జాయింట్ సెక్రటరీ చౌటపెల్లి రఘునందం,ఆర్గనైసింగ్ సెక్రటరీ శంకర్,మిట్టపెళ్లి రమేష్,మొకెన చంద్రశేఖర్,నెరేళ్ల రాము,చొప్పదండి ప్రణయ్ కుమార్ లను నియమించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా మహిళ అధ్యక్షురాలు పాత రాణి,జగిత్యాల జిల్లా టౌన్ ప్రెసిడెంట్ దేవసింగ్ రాథోడ్,జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జి సంగెపు ముత్హు పాల్గొన్నారు.