by Suryaa Desk | Tue, Nov 26, 2024, 12:20 PM
బూత్ స్థాయిలో నుండి బిజెపి పార్టీని నిర్మాణం చేపట్టి ప్రజల మధ్యలో పార్టీని నిలిపేలా పనిచేసేందుకు ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బిజెపి బూత్ కమిటీల మండల రిటర్నింగ్ అధికారి లక్కిరెడ్డి తిరుమలరెడ్డి కోరారు. సోమవారం కోహెడ మండలంలోని వరుకోలు, రాంచంద్రపూర్, వింజపల్లి, ఎర్రకుంటపల్లి, నారాయణపూర్, గొట్లమిట్ట, గ్రామాలలో బిజెపి కార్యకర్తల సమావేశం నిర్వహించి బూత్ కమిటీలను ఎన్నికచేయడం జరిగింది. అన్ని గ్రామాల్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు కోహెడ మండలంలోని 27 గ్రామాల్లో 50.పోలింగ్ బూతులలో కమిటీల నిర్మాణం డిసెంబర్ 5.వ తేదీలోపుగా పూర్తిచేసేందుకు అన్ని గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి పార్టీ కార్యకర్తల సమక్షంలో బూత్ కమిటీ అధ్యక్షుడు కార్యవర్గం ఎన్నికలు జరిపిస్తామని మండల బిజెపి బూత్ కమిటీల ఎన్నికల రిటర్నింగ్ అధికారి లక్కిరెడ్డి తిరుమల రెడ్డి తెలిపారు.
బూత్ మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ లక్కిరెడ్డి తిరుమల రెడ్డి, బిజెపి మండల అధ్యక్షుడు ఖమ్మం వేంకటేశం, ఆయా గ్రామాలకు బూత్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఖమ్మం సతీష్,జాలిగం రమేష్, చేను తిరుపతి కార్యకర్తల సమక్షంలో ఎన్నికైన అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో తాజమాజి ఎంపిటిసి ద్యాగటి సురేందర్, వివిధ గ్రామాల బీజేపీ శ్రేణులు అన్నాడి లక్ష్మారెడ్డి, బోలుమల్ల ఆంజనేయులు, అందవేని రాములు, నాగు అజయ్, బినావేని లక్ష్మణ్, మెండే సంపత్,శనిగరం సంతు, మడ్డి పర్షరాములు, ముత్యాల రమణారెడ్డి,బైరం అరవింద్, తదితరులున్నారు.