by Suryaa Desk | Tue, Nov 26, 2024, 01:11 PM
సంవిధాన్ దివస్‌ను ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తేదీన జరుపుకుంటారు. రాజ్యాంగ నిర్మాతల సేవలను స్మరించుకునేందుకు, వారి సేవలను గుర్తిస్తూ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటారు.ఈ ఏడాదితో రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుంది. నవంబర్ 26 వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, విభాగాలలో ఉత్సాహంగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నాయి.
ఇందులో భాగంగా కేంద్ర సమాచార, ప్రచార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26న కోదాడలోని అనురాగ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు సహాయ సంచాలకులు కోటేశ్వర రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి కోదాడ రెవెన్యూ డివిజనల్ అధికారి సీహెచ్. సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సందర్భంగా సోమవారం విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.