by Suryaa Desk | Tue, Nov 26, 2024, 02:37 PM
ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీ శ్రీ శివాలయం ఆవరణలో గల నాగదేవతల ఆలయంలో మంగళవారం ఉదయం కార్తీక మాసం చివరి మంగళవారం సందర్భంగా సుబ్రమణ్య స్వామివారికి, జంట నాగులకి, నాగ దేవతలకి భక్తులు పాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం అద్దారు, పువ్వులు పెట్టారు, పత్తి మాల వేశారు. అలంకరించి, దీప ధూపాలను వెలిగించి, దీపారాధన చేశారు. బెల్లం, చలిమిడి-చిమిలిని నైవేద్యాలుగా సమర్పించారు.