by Suryaa Desk | Wed, Nov 27, 2024, 10:04 PM
హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లను నిర్ధారించే వరకు హైదరాబాద్‌లోని చెరువుల పర్యవేక్షణ బాధ్యత తమదేనని తెలంగాణ హైకోర్టు స్పషం చేసింది. నగరంలోని అన్ని చెరువుల పర్యవేక్షణ తమదేనని తెలిపింది. రామమ్మ చెరువు బఫర్ జోన్‌లో నిర్మాణాలు జరగకుండా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. మరోవైపు, హెచ్ఎండీఏ పరిధిలో 3,532 చెరువులు ఉన్నాయని గత జులైలో విచారణ సందర్భంగా ప్రభుత్వం తెలిపింది. వాటికి బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించాలని హైకోర్టు ఆదేశించింది.ఈరోజు రామమ్మ చెరువు బఫర్ జోన్‌పై విచారణ సందర్భంగా హెచ్ఎండీఏ కమిషనర్ విచారణకు హాజరయ్యారు. ఇప్పటి వరకు 2,793 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ చేశామని, 530 చెరువులకు తుది నోటిఫికేషన్లు జారీ అయ్యాయని తెలిపారు. తదుపరి విచారణను డిసెంబర్ 30కి వాయిదా వేసింది. ఆ లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది