by Suryaa Desk | Wed, Nov 27, 2024, 03:05 PM
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినప్పటికి పల్లెలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని భాజపా మండల అధ్యక్షులు కొమ్ముల రాజపాల్ రెడ్డి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు.గ్రామంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అన్న చందంగా ఉన్నాయని విమర్శించారు.ప్రజా పాలన అని చెప్పి ప్రజలను, ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని ఏద్దేవ చేశారు.మండలంలోని పలు గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలను వివరించారు. ఇబ్రహీంపట్నం మండలం లోని బండాలింగాపూర్, సత్తక్కపల్లి, మేడిపల్లి, రాజేశ్వర్ పేట్ గ్రామాలను మెట్ పల్లి మండలంలో రెవెన్యూ డివిజన్ కై చేర్చినప్పటికి ఆ గ్రామాల ప్రజలు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు వెళ్ళాల్సి వస్తుందన్నారు.
అంతేకాకుండా కొండ్రికర్ల వాగు పై వంతెన, జగ్గాసాగర్ గ్రామ చెరువు వచ్చు వాగు మార్గం లను నిర్మించడం వంటి సమస్యలు పరిష్కరించలేదన్నారు.ప్రతి గ్రామంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ వాటిపై చిత్త శుద్ధి లేదన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పడిన తరువాత చేస్తానన్న హామీలను హామీలుగానే మిగల్చారని తెలిపారు. ఇకనైనా ప్రజా సమస్యలు పట్టించుకోవాలన్నారు.ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి జంగిటి శ్రీధర్,బిజీవైయం మండల అధ్యక్షులు పీసు రాజేందర్, నాయకులు ఆకుల శ్రీనివాస్, ఇల్లేందుల శ్రీనివాస్, బత్తిని శంకర్ గౌడ్,మారంపల్లి శ్రీనివాస్, కొట్టాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.