by Suryaa Desk | Wed, Nov 27, 2024, 11:46 AM
హైదరాబాద్ మహానగరంలోని బస్తా బస్తీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేపట్టిన దాడులు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. ఆ క్రమంలో మజ్లీస్ ఎమ్మెల్సీ వర్సెస్ జీహెచ్‌ఎంసీ మేయర్ అన్నట్లుగా పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం కోఠిలోని మోతీ మార్కెట్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆ క్రమంలో సదరు మార్కెట్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. అయితే ఆ తాళాలు పగలగొట్టిన మార్కెట్ తెరవడంపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ సీరియస్ అయ్యారు.మోతీ మార్కెట్ తాళాలు తీయకుంటే.. ఉద్యోగాలు పోతాయంటూ సేఫ్టీ అధికారులను ఎంఐఎం నేతలు బెదిరించడంపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఎమ్మెల్సీ బేగ్ పై ఆమె కాచిగుడా పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సీజ్ చేసిన మాంసాన్ని సైతం లాక్కొని, నోటీసులు సైతం చింపి వేయడంపై మేయర్ విజయలక్ష్మీ మండిపడినట్లు సమాచారం. అదీకాక మరోసారి తమ దుకాణాలపై దాడులు చేస్తే చర్యలు తప్పవంటూ ఆయన హెచ్చిరించినట్లు తెలుస్తుంది.