by Suryaa Desk | Wed, Jan 29, 2025, 02:44 PM
ఏపీతో పాటు తెలంగాణలో కూడా భూముల ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ, వాణిజ్య భూములు, రెసిడెన్షియల్ ప్లాట్లు, ఇళ్లు, ఫ్లాట్ల ధరలను ప్రభుత్వం పెంచనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం మార్కెట్లో భూముల విక్రయిస్తున్న ధరలు, రిజిస్ట్రేషన్ శాఖ దగ్గరున్న బుక్ వాల్యూ మధ్య చాలా తేడా ఉండటంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. సగటున 60 శాతం మేర భూముల ధరలను పెంచే అవకాశం ఉంది. ఏప్రిల్ 1 నుంచి భూముల ధరల పెంపు అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది.