by Suryaa Desk | Wed, Jan 29, 2025, 04:17 PM
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో 35 శాతం నిధులను వ్యవసాయం అనుబంధ రంగాలకు కేటాయించిందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. గత BRS ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష కూడా ఏకకాలంలో రుణమాఫీ చేయకపోవడంతో రైతులపై రూ. 11,145 కోట్ల వడ్డీ భారం పడిందన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని విశ్వసించే ప్రభుత్వం తమదని చెప్పారు. రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చిత్త శుద్దితో పనిచేస్తుందని పేర్కొన్నారు.