![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 03:55 PM
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో PACS వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు* ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ రామిడి రామిరెడ్డి,పిసిఎస్ డైరెక్టర్లు, రైతులు ప్రజలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు మాట్లాడుతూ మాసాయిపేట నా సొంత గ్రామం లాంటిది,వ్యవసాయం చేసిన ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.రైతులు అమ్మిన మూడు రోజుల్లోనే వారి ఖాతాలోకి డబ్బులు జమ చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.గతంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారని తెలిపారు,అలాంటి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర కల్పిస్తున్నామన్నారు.ఈ ప్రజా ప్రభుత్వంలో ఏ రైతు కూడా ఇబ్బంది పడొద్దని రైతులకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు.మాసాయిపేట గ్రామానికి చెరువులోకి నీరు తీసుకొని రాలేదని ప్రతిపక్షాలు చిల్లర మల్లర రాజకీయాలు చేస్తూ మద్యం మత్తులో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని ఇది సమంజసం కాదని అన్నారు.ఎంత డబ్బు ఖర్చైనా మాసాయిపేట చెరువులో నింపి ఆ రైతుల కాళ్లు కడుగుతామని అన్నారు.