![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 05:16 PM
తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలకు ప్రభుత్వం కీలక తేదీని ఖరారు చేసింది. రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించిన ప్రకారం, ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు ఇంటర్ ప్రథమ సంవత్సరం (ఫస్టియర్), ద్వితీయ సంవత్సరం (సెకండియర్) ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 28 నుండి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించగా, మొత్తం 9,80,978 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇప్పటికే మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ 10వ తేదీ నాటికి పూర్తయింది. ప్రస్తుతం మార్కుల నమోదుతో పాటు సాంకేతిక సమస్యలు తలెత్తకుండా కసరత్తు కొనసాగుతోంది. కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో, అధికారులు ఫలితాల ప్రకటనకు రెడీ అయ్యారు.