![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 10, 2025, 02:13 PM
రూ.2కే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించిన ఘనత ఎన్టీఆర్‌దేనని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీసు స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం మాట్లాడుతూ.. ఐటీ అనగానే సీఎం చంద్రబాబు గుర్తుకొస్తారు, ఆరోగ్యశ్రీ అంటే వైఎస్‌ఆర్ గుర్తుకొస్తారని అన్నారు. ఉద్యమాన్ని తమ బ్రాండ్‌గా కొందరు చెప్పుకుంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతి సీఎంకు ఓ బ్రాండ్ ఉంది.. తన బ్రాండ్ యంగ్ ఇండియా అని హర్షం వ్యక్తం చేశారు.