|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 11:19 AM
గౌరవ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గారి ఆధ్వర్యంలో అమలు చేస్తున్న “ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు కార్యాచరణను జలమండలి అన్నీ కార్యాలయాలలో నిర్వహించాలని సూచించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జలమండలి ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతంగా అమలు చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి జేఎండీ మయాంక్ మిట్టల్ తో కలిసి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” పేరుతో 06.03.2026 నుండి ప్రారంభమయ్యే 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతంగా నిర్వహించేందుకు సమగ్ర కార్యక్రమాన్ని రూపొందించిందని, ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి.. జలమండలి సంబంధించిన లక్ష్యాలను సాధించేందుకు ప్రతి అధికారి శక్తివంచన లేకుండా పనిచేయాలని అన్నారు.
జలమండలి ప్రధాన కార్యాయలంలోని గ్రౌండ్ ఫ్లోర్ లోని ఈడీపీ, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ వద్ద ఫైల్ డిస్పోసల్ ను పరిశీలించిన ఎండీ పేరుకుపోయిన పాత ఫైళ్లను తొలగించి కార్యాలయాన్ని పరిశ్రుభంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు. అవసరమైన ఫైళ్లను భద్రపరచాలి సూచించారు. అవరం మేరకు డాక్యుమెంట్లను స్కాన్ చేసి బ్యాక్ చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. అన్ని కార్యాలయాలు మరియు పరిసర ప్రాంగణాలను శుభ్రపరిచే కార్యక్రమంతో పాటు మొక్కల సంరక్షణ, పరిసరాల పరిశుభ్రతకు సంబంధించిన చర్యలను చేపట్టాలని ఆదేశించారు. జలమండలి చెందిన అన్ని కార్యాలయాలలో కార్యాలయ ప్రాంగణం పరిశుభ్రతపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని, అలాగే మూసివేసిన ఫైళ్లను సూచిక (ఇండెక్స్) ప్రకారం క్రమబద్ధీకరించి రికార్డు గదిలో భద్రపరచాలని చెప్పారు.ప్రతి కార్యాలయంలో ఈ-ఆఫీస్ వ్యవస్థ, డిజిటల్ గవర్నెన్స్ అమలు చేయాలని, ప్రస్తుతం ఉన్న అన్ని ఫైళ్లను 15 రోజులలో డిజిటల్ రూపంలోకి మార్చాలని ఆదేశించారు. ప్రతి ఫైలు స్కాన్ చేసి రేపటి నుంచి పది రోజులల్లో ఫీజికల్ ఫైళ్లనుతొలగించాలని, అవసరమైన మాన్యువల్ ఫైల్స్ ని ఈ-ఆఫీస్ కి కన్వర్ట్ చేసి పద్ధతి ప్రకారం బధ్రపరచాలని అన్నారు. ప్రతి ఫైలు ఈ-ఆఫిస్ ద్వారా రావాలని, ఒక్కసారి ఈ-ఆఫిస్ లో స్కాన్ అయ్యాక అదే లెటర్ ప్రతి ఒక్కరు మళ్ళి స్కాన్ చేయాల్సిన అవసరం ఉండదని, అది పై ఆఫిసర్ కు పంపడానికి ప్రతిసారి స్కాన్ చేయాల్సిన అవసరం ఉండదని వివరించారు.
ముందుగా జారీ చేసిన సూచనల మేరకు ప్రతి కార్యాలయం ఉదయం తనిఖీలు నిర్వహించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలనీ, సాధ్యమైనంతవరకు ప్రజాప్రతినిధులను కూడా ఈ తనిఖీల్లో భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఉదయం తనిఖీల సమయంలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలనీ, ఆమోదించబడిన అన్ని పనులను 7 రోజులలోపే ప్రారంభించి పనులను 99 రోజులలో పూర్తి చేయాలని అన్నారు. కార్యాలయాల్లో పనిచేస్తున్న అన్ని అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని వారి పనిచేసే స్థలంపాటు బాధ్యతల వివరాలతో ధృవీకరించి అవుట్‌సోర్సింగ్ డేటాను సిద్ధం చేయాలని చెప్పారు. వీటితో పాటు అన్ని ప్రాంతాల్లో వర్షపు నీటి సంరక్షణ (రెయిన్ వాటర్ హార్వెస్టింగ్) కార్యక్రమం నిర్వహించి, నీరు నిలిచే ప్రాంతాలు.. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అలాగే ఉపయోగంలో లేని బోర్‌వెల్లను రీచార్జ్ పిట్లుగా మార్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అలాగే, కలుషిత నీటికి సంబంధించిన అన్ని ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని, సీవరేజ్ ఓవర్‌ఫ్లోలు, కస్టమర్ చోకేజీ ఫిర్యాదులను గడువులో పరిష్కరించాలని అన్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రతిరోజు ప్రతి వార్డులో కనీసం 500 రన్నింగ్ మీటర్లు సీవర్ లైన్లను డీసిల్టింగ్ చేయాలని, 25 మాన్‌హోల్స్ శుభ్రం చేయాలి. దెబ్బతిన్న మాన్‌హోల్స్ మరమ్మత్తులు చేయడంతో పాటు మాన్‌హోల్ కవర్లు 99 రోజుల కార్యక్రమంలో మార్చాలని అన్నారు. నీటి సరఫరా పర్యవేక్షణకు ప్రత్యేక సమయం కేటాయించాలని, ఫీల్డ్ లెవల్ సిబ్బంది, మేనేజర్లు, డీజీఎంలు రోజువారీగా నీటి నాణ్యత, సరఫరా సమయాలు తదితర అంశాలను పర్యవేక్షించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ టీవీ శ్రీధర్, పర్సనల్ డైరెక్టర్ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, ఫైనాన్స్ డైరెక్టర్ పద్మావతి, ఓఅండ్ ఏం, ఫైనాన్స్, పీ అండ్ ఏ, ఐటీ, రెవిన్యూ, ట్రాన్స్మిషన్ సీజీఎంలు, జీఎంలు ఇతర అధికారులు పాల్గొన్నారు.