|
|
by Suryaa Desk | Wed, Oct 29, 2025, 02:34 PM
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే తన కొత్త చిత్రాన్ని బాబీ కొల్లితో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మేకర్స్ తాత్కాలికంగా 'మెగా 158' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని రోజులుగా ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్ర కోసం ప్రముఖ మలయాళ నటి మాళవిక మోహనన్ సెలెక్ట్ అయ్యినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రూమర్స్ పై నటి స్పందిస్తూ ఒక పోస్ట్ ని చేసింది. ఈ చిత్రంలో తాను భాగం కాదని స్పష్టం చేసింది. కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈ యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్టైనర్ ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
Latest News