|
|
by Suryaa Desk | Wed, Nov 05, 2025, 10:15 AM
నటి రష్మిక మందన్న ఇటీవల జగపతిబాబు హోస్ట్ చేస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' టాక్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. మగవారికి పీరియడ్స్ వస్తే మహిళల కష్టాలు అర్థమవుతాయని ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రష్మిక, 'ది గర్ల్ ఫ్రెండ్' చిత్రంతో నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఆమె 'మైసా' అనే లేడీ ఓరియెంటెడ్ మూవీతో పాటు బాలీవుడ్‌లో కొత్త ప్రాజెక్టులు, విజయ్ దేవరకొండతో ఒక పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో కూడా నటిస్తోంది.
Latest News