|
|
by Suryaa Desk | Wed, Mar 19, 2025, 10:34 AM
బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన కేసులో హైదరాబాద్ పోలీసుల విచారణకు విష్ణుప్రియ, టేస్టీ తేజ గైర్హాజరయ్యారు. వారిద్దరి తరఫున పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషా హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన మాట్లాడుతూ, పోలీసుల నుంచి నోటీసులు రావడంతో విష్ణుప్రియ, టేస్టీ తేజ షాక్‌లో ఉన్నారని తెలిపారు.ఈ కేసు భయంతోనే వారు విచారణకు గైర్హాజరయ్యారని వెల్లడించారు. మూడు రోజుల తర్వాత వారు విచారణకు హాజరయ్యేందుకు అనుమతి కోరగా, పోలీసులు అంగీకరించినట్లు తెలిపారు. ఇక నుంచి లీగల్, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేయకూడదని బిగ్ బాస్ గ్రూపు సభ్యులమంతా నిర్ణయించుకున్నామని తెలిపారు.
Latest News