|
|
by Suryaa Desk | Wed, Mar 19, 2025, 10:36 AM
బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన ప్రముఖులకు హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. నిన్న సాయంత్రం విచారణకు హాజరు కావాల్సిందిగా విష్ణుప్రియ, టేస్టీ తేజలకు పోలీసులు నోటీసులు అందజేశారు. ఈ వ్యవహారంలో మరికొంతమందికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.బెట్టింగ్ యాప్స్ కేసులో పంజాగుట్ట పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో భాగంగా పదకొండు మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన మరికొందరిపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Latest News