![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 01:57 PM
గువాహతి వేదికగా నిన్న సీఎస్‌కే, ఆర్ఆర్ మ్యాచ్ జరగగా ఈ మ్యాచ్‌లో బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా అందరీ దృష్టిని ఆకర్షించారు . దీనికి కారణం ఆమె శ్రీలంక మాజీ క్రికెటర్, ప్రస్తుత రాజస్థాన్ రాయల్స్ జట్టు డైరెక్టర్ కుమార సంగక్కరతో కలిసి మ్యాచ్ వీక్షించడమే. వారిద్దరూ ఎంచక్కా మాట్లాడుకుంటూ మ్యాచ్ తిలకించారు. రాజస్థాన్ రాయల్స్ జెర్సీలో క్రికెట్ ఫీవర్‌లో మలైకా పూర్తిగా ఇంట్లోనే ఉన్నట్లు కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. వాటిని చూసిన అభిమానులు మలైకాకు కొత్త బాయ్ ఫ్రెండ్ దొరికేశాడా, వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారా అని ఆరా తీస్తున్నారు. ఇక 51 ఏళ్ల మలైకాకు ఇటీవలే అర్జున్ కపూర్‌తో బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం సింగిల్‌గా ఉన్న ఆమె సంగక్కరతో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక పాత్ర పోషించిన సంగక్కర... ప్రస్తుత సీజన్‌కు ముందు వరకు ఆ టీమ్ హెడ్ కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ జట్టు క్రికెట్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. ఈ సీజన్ నుంచి రాహుల్ ద్రవిడ్ జట్టు కొత్త ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడంతో సంగక్కర డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా, సంగక్కర ఐపీఎల్‌లో ఆటగాడిగా కూడా తనదైన ముద్ర వేశారు. పంజాబ్ కింగ్స్ గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించారు.
Latest News