![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 02:58 PM
‘డాక్టర్ కిల్‌డేర్’ టీవీ సీరియల్‌తో అందరికీ సుపరిచితుడైన రిచర్డ్ చాంబర్లీన్ (90) కన్నుమూశారు. వయో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన హవాయ్‌లోని వైమనలో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచినట్లు సన్నిహితులు తెలిపారు. 1934లో కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్‌లో జన్మించిన ఈయన డాక్టర్ కిల్‌డేర్ సీరియల్‌లోని డాక్టర్ జేమ్స్ కిల్‌డేర్ పాత్రతో 1961లో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.అప్పట్లో అమెరికాలో 60 శాతం మంది టీవీ వీక్షకులు థోర్న్ బర్డ్స్ సీరియల్‌నే చూడటం ఓ రికార్డు. ఇది ఏకంగా 16 ఎమ్మీ నామినేషన్లు పొందింది. స్వలింగ సంపర్కుడైన చాంబర్లీన్.. ఆ విషయాన్ని 70 ఏళ్ల వయస్సులో ‘షట్టర్డ్ లవ్’ పేరుతో విడుదల చేసిన ఆత్మకథలో మొదటిసారిగా అంగీకరించారు. నటుడు, దర్శకుడు మార్టిన్ రబెట్‌తో 30 ఏళ్లపాటు బంధం కొనసాగించారు. 2010లో వీరిద్దరూ విడిపోయారు
Latest News