![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 04:02 PM
టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఆయన మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఐదు రోజుల క్రితం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారని తెలిపారు.ముళ్లపూడి బ్రహ్మానందం కుమారుడు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. ఆయన వచ్చిన తర్వాత బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య మంగాయమ్మ, కుమారుడు సతీశ్, కూతురు మాధవి ఉన్నారు. దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు ముళ్లపూడి బ్రహ్మానందం బావ అవుతారు. ఈవీవీ సోదరిని ఆయన పెళ్లి చేసుకున్నారు. తెలుగులో ముళ్లపూడి పలు చిత్రాలను నిర్మించారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Latest News