|
|
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 04:20 PM
ప్రముఖ పంజాబీ గాయకుడు హన్స్ రాజ్ భార్య రేషమ్ కౌర్ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రేషమ్ కౌర్ బుధవారం జలంధర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కౌర్ మృతికి పలువురు కేంద్ర మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. గురువారం సఫీపూర్‌లో అంత్యక్రియలు జరుగుతాయని పరంజిత్ సింగ్ తెలిపారు. మధ్యాహ్నం 1 ఒంటి గంటకు జలంధర్‌లోని ఠాగూర్ ఆస్పత్రిలో రేషమ్ కౌర్ చనిపోయినట్లు పేర్కొన్నారు. కౌర్ మృతి పట్ల కేంద్రమంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, శిరోమణి అకాలీదళ్ నాయకుడు దల్జిజ్ సింగ్ సంతాపం తెలిపారు. హన్స్ రాజ్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఫరీద్‌కోట్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు
Latest News