![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 03:28 PM
ధనుష్, నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఇడ్లీ కడై’ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా హీరో ధనుష్ ప్రకటించారు. ఏప్రిల్ 10న విడుదల కావాల్సిన ఈ చిత్రం, తాజాగా అక్టోబర్ 1కి వాయిదా వేసినట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం వెనుక కారణాలు ఏంటనేది వెల్లడించలేదు. ‘ఇడ్లీ కడై’ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలున్న నేపథ్యంలో, విడుదల తేదీ మారడం సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.కాగా.. ఇడ్లీ కడై మూవీని గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అరుణ్ విజయ్, షాలినీ పాండే, ప్రకాష్ రాజ్, రాజ్‌కిరణ్ ప్రధాన పాత్రలు పోషించారు. కాగా ‘ఇడ్లీ కడై’ తెలుగు విడుదల హక్కులను శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత, నిర్మాత చింతపల్లి రామారావు సొంతం చేసుకున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నారు.
Latest News