![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 12, 2025, 11:06 PM
హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం 'వార్ 2'. వార్-2 చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఆగష్టు 14న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో హృతిక్ రోషన్ 'వార్ 2' గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ నటన గురించి ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. "ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు. అతడితో కలిసి పనిచేయడం ఒక గొప్ప అనుభూతి. ఎన్టీఆర్ నటనకు నేను ఫిదా అయ్యాను. ముఖ్యంగా ఎన్టీఆర్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను" అని హృతిక్ అన్నారు. అంతేకాకుండా, వార్ కంటే 'వార్ 2' మరింత భారీగా ఉండబోతోందని తెలిపారు. 'వార్ 2'లో ఎన్టీఆర్ 'రా' ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాలో హృతిక్, ఎన్టీఆర్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. వీరిద్దరిపై ఒక ప్రత్యేక గీతం కూడా ఉంటుందని తెలుస్తోంది. దీనికి ప్రీతమ్ సంగీతం అందించారు.
Latest News