![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 12, 2025, 11:10 PM
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కాస్ట్లీ గిఫ్ట్ అందుకున్నారు. సుమారు రూ. 5 కోట్ల విలువైన లంబోర్ఘిని కారును ఆమె కానుకగా అందుకోవడం విశేషం. ఇంతకీ జాన్వీకు ఇంతంటి విలువైన బహుమతి ఇచ్చింది ఎవరో తెలుసా! బిర్లా వారసురాలు, ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా కూతురు అనన్య బిర్లా. జాన్వీ కపూర్, అనన్య బిర్లా చాలా కాలంగా మంచి స్నేహితులు. ఇటీవల అనన్య బ్యూటీ ప్రొడక్ట్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అయితే, ఈ బ్రాండ్‌కు జాన్వీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. తన బ్యూటీ ప్రొడక్ట్స్ బ్రాండ్ కు జాన్వీ సహకరిస్తున్నందుకు కానుకగా అనన్య ఈ ఖరీదైన లంబోర్ఘిని కారును ఆమెకు గిఫ్ట్‌గా పంపించారని సమాచారం.శుక్రవారం ఉదయం లిలాక్ (పర్పుల్) రంగు లంబోర్ఘిని కారు జాన్వీ నివాసానికి చేరుకుంది. ఈ కారుతో పాటు మరో గిఫ్ట్ ప్యాక్ కూడా ఉంది. దానిపై “ప్రేమతో, నీ అనన్య” అని రాసి ఉంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, జాన్వీ కపూర్ గతేడాది 'దేవర'తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తొలి సినిమాతోనే హిట్ కూడా అందుకున్నారు. ఆ తర్వాత ఈ బ్యూటీ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో తెరకెక్కుతున్న 'పెద్ది' చిత్రంలో అవకాశం దక్కించుకుంది.
Latest News