|
|
by Suryaa Desk | Thu, May 01, 2025, 02:36 PM
గుప్పెడంత మనసు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి జ్యోతిరాయ్. ప్రస్తుతం జ్యోతిరాయ్ తెలుగులోనే ఒకటి రెండు సినిమాలు చేస్తోంది. అందులో ఒకటి ‘కిల్లర్’. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్. తాజాగా మూవీ టీజర్‌ని విడుదల చేశారు. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో లాంటి ఎలిమెంట్స్‌తో గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో..ఇలాంటి ఎలిమెంట్స్ తో గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. “కిల్లర్” మూవీ గ్లింప్స్ ఎలా ఉందో చూస్తే – ప్రాచీన వైమానిక శాస్త్రంలో ఆశ్చర్యపరిచే మానవ మేథస్సు రహస్యాలు వెల్లడించారు. ఆత్మ కలిగిన యంత్రాలు చూస్తారంటూ వైమానిక శాస్త్రంలో చెప్పిందే నిజం కాబోతోందా అంటూ ఈ గ్లింప్స్ ప్రారంభమైంది. డి బౌండ్ అనే డిజార్డర్ తో బాధపడుతున్న హీరోయిన్ రాయ్, పూర్తిగా కోలుకుంటే పునర్జన్మ ఎత్తినట్లే అని, అప్పుడు ఆమెకు ఎదురు నిలవడం ఎవరి వల్లా కాదని గ్లింప్స్ లో చూపించారు. సూపర్ షీ క్యారెక్టర్ లో జ్యోతి రాయ్ చేసిన స్టన్నింగ్ యాక్షన్, సెటిల్డ్ పర్ ఫార్మెన్స్ హైలైట్ గా నిలుస్తోంది. లవ్, రొమాన్స్, రివేంజ్, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, థ్రిల్లర్ అంశాలతో ఈ సినిమా రూపొందించినట్లు గ్లింప్స్ తో తెలుస్తోంది. మొదలెడదామా అంటూ గ్లింప్స్ చివరలో హీరో, డైరెక్టర్ పూర్వాజ్ పవర్ ఫుల్ డైలాగ్ తో ఆకట్టుకున్నారు. హై క్వాలిటీ మేకింగ్, వీఎఫ్ఎక్స్ గ్లింప్స్ కు ఆకర్షణగా నిలుస్తున్నాయి.