|
|
by Suryaa Desk | Fri, May 30, 2025, 07:46 AM
లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు రావు రమేష్ నటించిన 'మారుతీ నగర్ సుబ్రమణ్యం' సినిమా కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టి హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో రావు రమేష్ నటనకి భారీ రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు మరియు జీ సినిమాలు ఛానల్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జీ తెలుగు ఛానల్ లో మే 30న ఉదయం 9 గంటలకి స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ఛానల్ ప్రకటించింది. ఈ చిత్రంలో అంకిత్ కొయ్య, ఇంద్రజ, రమ్య, అన్నపూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ సుకుమార్ భార్య తబిత సుకుమార్ సమర్పిస్తున్నారు.
Latest News